Karnataka: మరో రెండు రోజుల్లో కర్ణాటకలో తెరుచుకోనున్న జిమ్‌లు, గోల్ఫ్‌క్లబ్‌లు

Golf Clubs and Restaurants will be open from 18th onwards in karnataka
  • ఈ నెల 17తో ముగియనున్న లాక్‌డౌన్  
  • హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు సీఎం సానుకూలం
  • కొత్త మార్గదర్శకాలు వచ్చిన వెంటనే తెరుస్తామన్న మంత్రి
కర్ణాటకలో మరో రెండు రోజుల్లో జిమ్‌లు, గోల్ఫ్‌క్లబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకోనున్నాయి. మూడో దశ లాక్‌డౌన్ ముగిసిన వెంటనే వీటిని ప్రారంభించేందుకు సమాయత్తం అవుతున్నట్టు ఆ రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి సీటీ రవి తెలిపారు. వీటిని తెరిచే విషయమై ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో చర్చించినట్టు తెలిపారు.

రెస్టారెంట్లు, హోటళ్లు పునఃప్రారంభం విషయంలో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ నెల 17న లాక్‌డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో కేంద్రం నుంచి కొత్త మార్గదర్శకాలు విడుదలైన వెంటనే రాష్ట్రంలో  జిమ్‌లు, గోల్ఫ్ క్లబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతి ఇస్తామని మంత్రి వివరించారు.
Karnataka
Hotels
Lockdown
Golf Clubs
Restaurants

More Telugu News