సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఆ పాత్రలు సంతృప్తినిస్తాయంటున్న రకుల్
- రానా, మిహీకాల పెళ్లి అప్ డేట్
- ఎన్టీఆర్ అభిమానులపై ప్రణీత ప్రశంసలు
* రానా దగ్గుబాటి తన ప్రేయసి మిహీకా బజాజ్ తో తన వివాహాన్ని ప్రకటించగానే ఇది చిత్ర పరిశ్రమలో పెద్ద న్యూస్ అయింది. ఇక వీరి వివాహాన్ని రానా తండ్రి సురేశ్ బాబు చాలా గ్రాండ్ గా చేయడానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా వీరి పెళ్లిని విదేశాల్లో చేయాలని అనుకుంటున్నారని, ఒకవేళ అక్కడ కుదరని పక్షంలో ఇండియాలోనే మరో అందమైన ప్రదేశంలో గ్రాండ్ గా చేస్తారని సమాచారం.
* ఎన్టీఆర్ అభిమానులపై కథానాయిక ప్రణీత ప్రశంసలు కురిపించింది. తాడిపత్రి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారన్న వార్తను చూసి ప్రణీత 'సూపర్' అంటూ అభినందించింది. గతంలో ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో ప్రణీత కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.