MS Dhoni: ప్రస్తుత పరిస్థితుల్లో ధోనీకి కష్టమే: వెంకటేశ్ ప్రసాద్

Dhoni re entry is not so easy says Venkatesh Prasad
  • 40 ఏళ్ల వయసులో రీఎంట్రీ అంత సులభం కాదు
  • ఒక వ్యూహంలో భాగంగానే జట్టులోకి తీసుకునే అవకాశం
  • ధోనీ బ్యాటింగ్ స్థానాన్ని మార్చాలి
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రీఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పలువురు క్రికెట్ దిగ్గజాలు ఇప్పటికే ఈ అంశంపై స్పందించారు. దీనిపై మాజీ ఫాస్ట్ బౌలర్, మాజీ బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధోనీ తిరిగి జట్టులో స్థానం సంపాదించుకోవడం కష్టమేనని చెప్పారు. క్రికెట్ కు ఏడాది కాలంగా దూరంగా ఉన్న ధోనీ... తన రీఎంట్రీని మరింత క్లిష్టంగా మార్చుకున్నాడని అభిప్రాయపడ్డారు. ధోనీ వయసు 40కి చేరువవుతోందని... ఈ వయసులో రీఎంట్రీ అంత ఈజీ కాదని అన్నారు.

టీమ్ మేనేజ్ మెంట్ ఒక వ్యూహంలో భాగంగా ధోనీని కోరుకుంటే తప్ప... అతని రీఎంట్రీ అసాధ్యమని వెంకటేశ్ ప్రసాద్ చెప్పారు. ఒకవేళ ధోనీని జట్టులోకి తీసుకున్నా... అతని బ్యాటింగ్ స్థానాన్ని మార్చాలని అన్నారు. ఫినిషర్ గా కాకుండా.... మూడు లేదా నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ కు పంపాలని చెప్పారు. తనకే అవకాశం ఉంటే ఇదే చేస్తానని అన్నారు.
MS Dhoni
Re Entry
Venkatesh Prasad
Team India

More Telugu News