Prakasam District: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం

  • విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్
  • ట్రాక్టర్ పై తెగిపడిన విద్యుత్ తీగలు
  • మృతుల్లో ఏడుగురు మహిళలు
10 died in Prakasam District road accident

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 9 మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. మృతులంతా రాపర్ల చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారిగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన పలువురిని చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ప్రాణాలు కోల్పోయిన వారిలో ఏడుగురు మహిళలు, ఒక రైతు, ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. మృతదేహాలను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 15 మంది వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.

లాక్ డౌన్ వెసులుబాటు నేపథ్యంలో వీరంతా ఈ ఉదయం మిరప కోత పనులకు వెళ్లారు. సాయంత్రం పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ట్రాక్టర్ అదుపుతప్పింది. వేగంగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో, కరెంట్ తీగలు ట్రాక్టర్ పై పడ్డాయి. దీంతో కరెంట్ షాక్ కొట్టి 9 మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News