Black Panther: గోల్కొండలో నల్ల చిరుత అంటూ కలకలం... చివరికి అడవి పిల్లి అని తేల్చిన అధికారులు

  • లాక్ డౌన్ తో జనవిహీనంగా రోడ్లు
  • స్వేచ్ఛా సంచారం చేస్తున్న వన్యప్రాణులు
  • గోల్కొండ పీఎస్ పరిధిలో మాను పిల్లి పట్టివేత
Cat triggered rage in Golconda area

కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ కారణంగా రోడ్లపై జనసంచారం బాగా తగ్గిపోయింది. దాంతో వన్యప్రాణులు యథేచ్ఛగా బయటికి వస్తూ, కొన్నిసందర్భాల్లో రోడ్లపైనే తిష్టవేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా కాటేదాన్ అండర్ బ్రిడ్జిపై ఓ చిరుత ఇలాగే కనిపించింది.

తాజాగా హైదరాబాదులోని గోల్కొండ పీఎస్ పరిధిలో అరుదైన నల్ల చిరుత (బ్లాక్ పాంథర్) సంచరిస్తోందంటూ కలకలం రేగింది. ఫతేదర్వాజా వద్ద దీన్ని కొందరు ఫొటోలు కూడా తీశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు, జూ సిబ్బంది ప్రత్యేక బోను ఏర్పాటు చేసి ఆ వన్యప్రాణిని బంధించగా, అది నల్ల చిరుత కాదని, మాను పిల్లి అని తేలింది. దాంతో స్థానికుల్లో భయాందోళనలు తొలగిపోయాయి.

More Telugu News