గోల్కొండలో నల్ల చిరుత అంటూ కలకలం... చివరికి అడవి పిల్లి అని తేల్చిన అధికారులు
- లాక్ డౌన్ తో జనవిహీనంగా రోడ్లు
- స్వేచ్ఛా సంచారం చేస్తున్న వన్యప్రాణులు
- గోల్కొండ పీఎస్ పరిధిలో మాను పిల్లి పట్టివేత
తాజాగా హైదరాబాదులోని గోల్కొండ పీఎస్ పరిధిలో అరుదైన నల్ల చిరుత (బ్లాక్ పాంథర్) సంచరిస్తోందంటూ కలకలం రేగింది. ఫతేదర్వాజా వద్ద దీన్ని కొందరు ఫొటోలు కూడా తీశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు, జూ సిబ్బంది ప్రత్యేక బోను ఏర్పాటు చేసి ఆ వన్యప్రాణిని బంధించగా, అది నల్ల చిరుత కాదని, మాను పిల్లి అని తేలింది. దాంతో స్థానికుల్లో భయాందోళనలు తొలగిపోయాయి.