Migrants: వలస కార్మికులపై కేంద్రం కరుణ... మంత్రి నిర్మల ఏం చెప్పారంటే..!

  • 8 కోట్ల మంది వలసకార్మికులకు ఉచిత రేషన్
  • ఆగస్టు 31 వరకు దేశంలో ఎక్కడైనా తీసుకోవచ్చని వెల్లడి
  • వలసకార్మికుల కోసం ప్రధాన నగరాల్లో గృహ సముదాయాలు
Centre allocates more for migrant workers

లాక్ డౌన్ కారణంగా ఎంతో నష్టపోయిన వలస కార్మికులపై కేంద్ర ప్రభుత్వం కరుణ చూపింది. వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయిన వారి అన్నపానీయాల కోసమే రూ.11 వేల కోట్లు కేటాయించిన కేంద్రం, వారి భవిష్యత్ పై భారీగా వెచ్చించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వివరాలు తెలిపారు. 8 కోట్ల మంది వలస కార్మికులకు ఉచితంగా రేషన్ అందించనున్నట్టు వెల్లడించారు. దేశంలో వలస కూలీలందరికీ ప్రత్యేక రేషన్ కార్డులు ఇస్తామని, ఈ కార్డుల ద్వారా 20 రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ పొందే వీలుందని వివరించారు.

రాబోయే రెండు నెలలు కూడా వలస కార్మికులకు ఉచితంగా రేషన్ అందిస్తామని చెప్పారు. రేషన్ కార్డు లేకపోయినా 10 కిలోల బియ్యం, ఒక కిలో శనగలు పంపిణీ చేస్తామని అన్నారు. దేశంలో ఇప్పటికే 83 శాతం రేషన్ కార్డుల పోర్టబిలిటీ పూర్తయిందని, వన్ నేషన్... వన్ రేషన్ పథకం కింద ఆగస్టు 31 వరకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని తెలిపారు.

అంతేకాకుండా, వలస కూలీలు, పేదల వసతిపైనా కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వలస కూలీలు, పట్టణ పేదల కోసం ప్రధాన నగరాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. తక్కువ అద్దెతో పేదవారికి గృహ సముదాయాలు ఏర్పాటు చేయనున్నామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా గృహసముదాయాల నిర్మాణం జరుగుతుందని వివరించారు.

వలస కార్మికులకు ఉపాధి హామీ పథకం కింద పని కల్పించేందుకు చర్యలు ఉంటాయని, వారు తాము ఉన్నచోటే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉపాధి పొందవచ్చని వెల్లడించారు.  కనీసం 10 మందికి పైగా ఉపాధి కల్పించే సంస్థలన్నింటికి ఈఎస్ఐ సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. వలస కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు.

ఇక ముద్ర శిశు రుణాల పథకంలో రూ.50 వేల లోపు తీసుకున్నవారికి 2 శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుందని, అందుకోసం రూ.1500 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. దేశంలోని చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాబోయే నెలరోజుల్లో వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక స్కీమ్ తీసుకువస్తున్నామని తెలిపారు. ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఆదాయం వచ్చే మధ్య తరహా ఆదాయ కుటుంబాలకు గృహ నిర్మాణ పథకం 2021 మార్చి వరకు పొడిగిస్తున్నామని వెల్లడించారు. అంతేకాదు,

More Telugu News