work from home: ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 15 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్: కేంద్ర ప్రభుత్వం

every year work from home for  15 days for central govt employees
  • ఇప్పటికే సిద్ధమైన డ్రాఫ్ట్
  • డిజిటల్ వేదికగా పనులు ప్రారంభించిన 75 విభాగాలు
  • వీడియో కాన్ఫరెన్సులకే మొగ్గు
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి నుంచి ప్రతి ఏడాది 15 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేలా ఆదేశాలు జారీ చేయబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే డ్రాఫ్ట్ రూపకల్పన జరిగిందని అధికారులు తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పనిని సులభతరం చేసేందుకు అన్ని మంత్రిత్వ శాఖలు, వాటి అనుబంధ విభాగాల్లో ఈ-ఆఫీస్ సదుపాయాన్ని అమలు చేయబోతోంది. ఇప్పటికే 75 విభాగాల డిజిటల్ వేదికగా పనులను ప్రారంభించాయి.

అయితే కీలకమైన ఫైళ్ల విషయంలో మాత్రం కొంత ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో, ఫైళ్లను వెబ్ సైట్లలో పెట్టరాదని... ఆఫీసుకి వచ్చే ఉద్యోగులు మాత్రమే వాటిని చూడాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధనను విధించింది. మరోవైపు అధికారిక సమావేశాల బదులు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించాలని కూడా డ్రాఫ్ట్ లో పేర్కొన్నట్టు సమాచారం.
work from home
union gove

More Telugu News