Hyderabad: తెలంగాణలో సీసీటీవీ కెమెరాల ఆధారంగా మాస్కులు ధరించని వారిపై కేసులు

  • మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వచ్చే వారి విషయంలో కఠిన నిబంధనలు
  • రూ. వెయ్యి జరిమానాను కోర్టులో చెల్లించేలా ఏర్పాట్లు  
  • ఇప్పటివరకు  4,719 మందిపై కేసుల నమోదు 
Telangana Government implements strict rules in the wake of corona

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల నిమిత్తం మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వచ్చే వారి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా రోడ్లపై తిరిగే వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా మాస్కులు లేని వారిని గుర్తిస్తున్న పోలీసులు వారికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ చలానాలు అందజేస్తున్నారు. జరిమానాను కోర్టులో చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. మాస్కులు ధరించని వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్టు సెక్షన్ 51 బి కింద నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 4,719 మందిపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం.

More Telugu News