Brahmaji: మరింతకాలం ఇలాగే అయితే మాకు చిప్పే గతి: నటుడు బ్రహ్మాజీ

Actor Brahmaji Comment on Lockdown goes Viral
  • మరోమారు లాక్ డౌన్ పొడిగించే అవకాశం
  • ఇప్పటికే అవస్థలు పడుతున్న ప్రజలు
  • తమ పరిస్థితి కూడా అంతే అవుతుందంటున్న బ్రహ్మాజీ
ఇప్పటికే లాక్ డౌన్ ను రెండుసార్లు పొడిగించిన కేంద్రం, లాక్ డౌన్ 4.0పై సమాలోచనలు సాగిస్తున్న వేళ, ఎంతో మంది మధ్యతరగతి ప్రజలు వేతనాలు లేక, ఇళ్లకే పరిమితమై అవస్థలు పడుతున్నారు. ఇక దిగువ తరగతి ప్రజలు మరిన్ని ఇబ్బందుల్లో కూరుకుని పోయారు. లాక్ డౌన్ ను పొడిగిస్తే, తమ పరిస్థితి మరింత ఘోరంగా మారిపోతుందన్న ఆందోళన ప్రజల్లో నెలకొని వుంది.

ఈ నేపథ్యంలో పేదలు, మధ్యతరగతి వాళ్లపైనే లాక్ డౌన్ ప్రభావం ఉంటుందని భావించనక్కర్లేదని, లాక్ ‌డౌన్ ఇంకా పొడిగిస్తే తమ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందంటూ, చేతిలో చిప్ప పట్టుకుని కూర్చున్న తన పాత ఫొటోను నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "లాక్ ‌డౌన్ ఇంకా పొడిగిస్తే మా పరిస్థితి ఇది.." అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటో వైరల్ కావడంతో పలువురు సరదాగా స్పందిస్తూ, తాము పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతున్నారు.
Brahmaji
Lockdown
Extenssion

More Telugu News