Nairuti: రుతుపవనాలపై శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ!

  • ఆరు రోజుల ముందుగానే అండమాన్ కు
  • రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
  • శనివారం సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం
IMD Good News on Nairuthi Monsoons

ఈ సంవత్సరం నైరుతీ రుతుపవనాలు దాదాపు 6 రోజుల ముందుగానే అండమాన్, నికోబార్ దీవులకు చేరుతాయని భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. మామూలుగా అయితే, మే 20 తరువాత రుతుపవనాలు అండమాన్ ను తాకుతాయి. ఆపై మరో 10 నుంచి 11 రోజుల్లో కేరళకు చేరుతాయి.

ఇక కేరళకు నైరుతీ రుతుపవనాలు ఎప్పుడు చేరుకుంటాయన్న విషయమై కచ్చితమైన తేదీలను ఓ వారం రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. ఇదిలావుండగా, రేపు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, శనివారం సాయంత్రానికి తుపానుగా మారుతుందని, ఈ కారణంగానే నైరుతి త్వరగా ప్రవేశించనుందని అధికారులు తెలియజేశారు.

More Telugu News