jasprit bumrah: అర్జున అవార్డు రేసులో బుమ్రా, శిఖర్ ధవన్.. బీసీసీఐ ప్రతిపాదన!

  • 64 వన్డేల్లో 104, 14 టెస్టుల్లో 68 వికెట్లు పడగొట్టిన బుమ్రా
  • 2018లో నామినేట్ అయినా ధవన్‌కు దక్కని అవార్డు
  • మహిళల విభాగం నుంచి దీప్తి శర్మ నామినేట్ అయ్యే అవకాశం
Jasprit Bumrah likely to be BCCIs nomination for Arjuna Award

టీమిండియా టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు నామినేట్ చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2018లో బీసీసీఐ ప్రతిపాదించినప్పటికీ అర్జున అవార్డును దక్కించుకోలేకపోయిన ఓపెనర్ శిఖర్ ధవన్ పేరును కూడా బీసీసీఐ పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఒకవేళ ఈ అవార్డు కోసం ఒకటి కంటే ఎక్కువ పేర్లను ప్రతిపాదించాలని భావిస్తే అప్పుడు బుమ్రాతోపాటు ధవన్ పేరును కూడా బీసీసీఐ నామినేట్ చేసే అవకాశం ఉంది. బుమ్రా (26) ఇప్పటి వరకు 14 టెస్టుల్లో 68 వికెట్లు పడగొట్టగా, 64 వన్డేల్లో 104 వికెట్లు, 50 టీ20 మ్యాచుల్లో 59 వికెట్లు తీసుకున్నాడు. ఇక, మహిళల విభాగం నుంచి దీప్తి శర్మ పేరును అర్జున అవార్డుకు నామినేట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

More Telugu News