Andhra Pradesh: 'నవరత్నాలు' కోసం భూముల వేలం.. ఎక్కడెక్కడ ఎంత భూమి అంటే!

  • ఈ నెల 29న తొమ్మిది స్థలాలకు ఈ-ఆక్షన్ ద్వారా వేలం
  • తొమ్మిది స్థలాలకు రిజర్వ్ ధర రూ. 208.62 కోట్లు
  • తొలి విడతలో విశాఖ, గుంటూరు జిల్లాల్లో భూముల అమ్మకం
AP govt selling land for Navaratnalu

భూములను వేలం వేసే ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం షూరూ చేసింది. తొలి విడతలో విశాఖ, గుంటూరు జిల్లాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో ఉన్న భూమిని వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 29న ఈ ఆక్షన్ ప్రక్రియ ద్వారా వేలం కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ వేలంలో సమకూరే ఆదాయాన్ని నవరత్నాలు, నాడు-నేడు వంటి కార్యక్రమాల అమలుకు వెచ్చించనుంది. ఈ వేలం ప్రక్రియను బిల్డ్ ఏపీ మిషన్ చేపట్టబోతోంది. ఈ సందర్భంగా బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ మాట్లాడుతూ, వేలంపాటలో ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. వేలం వేయాలనుకున్న తొమ్మిది స్థలాలకు రిజర్వ్ ధరగా రూ. 208.62 కోట్లను నిర్ణయించినట్టు చెప్పారు. ధరావతు కింద పది శాతం చెల్లించాలని  తెలిపారు.  

వేలం వేసే భూముల వివరాలు:

గుంటూరు జిల్లా:
నల్లపాడు - 6.07 ఎకరాలు
శ్రీనగర్ కాలనీ - 5.44 ఎకరాలు
మెయిన్ బీటీ రోడ్డు - 1.72 ఎకరాలు

విశాఖ జిల్లా:
చిన గడ్లీ - 1 ఎకరం
చిన గడ్లీ - 75 సెంట్లు
ఆగనంపూడి - 50 సెంట్లు
ఫకీర్ టకియా ఎస్ఈజెడ్ - 35 సెంట్లు
ఫకీర్ టకియా ఎస్ఈజెడ్ - 1.93 ఎకరాలు
ఫకీర్ టకియా ఎసీఈజెడ్ - 1.04 ఎకరాలు

More Telugu News