Nikhil: హీరో నిఖిల్ పెళ్లి వేడుక ప్రారంభం..  వీడియో ఇదిగో!

Hero Nikhil wedding celebration begins
  • పల్లవి వర్మతో నిఖిల్ వివాహం
  • హైదరాబాద్ శివార్లలోని ఫామ్ హౌస్ లో పెళ్లి
  • లాక్ డౌన్ నేపథ్యంలో కొందరు మాత్రమే హాజరు
సినీ హీరో నిఖిల్ పెళ్లి వేడుక ప్రారంభమైంది. పల్లవి వర్మ అనే డాక్టర్ ను నిఖిల్ పెళ్లాడుతున్నాడు. వీరిది పెద్దల అంగీకారంతో జరుగుతున్న ప్రేమ పెళ్లి. నిఖిల్ ని పెళ్లికొడుకుని చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో, అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే వేడుకకు హాజరయ్యారు. హైదరాబాద్ శివార్లలోని ఓ ఫామ్ హౌస్ లో ఈ పెళ్లి జరుగుతోంది. వాస్తవానికి ఏప్రిల్ 16నే పెళ్లి జరగాల్సి ఉంది. అయితే లాక్ డౌన్ కారణంగా వివాహం వాయిదా పడింది. దీంతో మే 14న పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.
Nikhil
Tollywood
Marriage

More Telugu News