Jagan: చీఫ్ సెక్రటరీ పదవీకాలం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్.. కేంద్రానికి లేఖ!

  • జాన్ నెలాఖరుతో ముగుస్తున్న నీలం సాహ్ని పదవీకాలం
  • పదవీకాలాన్ని 6 నెలలు పొడిగించాలని కేంద్రానికి జగన్ లేఖ
  • కరోనా నేపథ్యంలో సీఎస్ మార్పుపై సుముఖంగా లేని సీఎం
Jagan decides to extend CS tenure

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలాన్ని పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. జూన్ నెలాఖరుతో సీఎస్ పదవీకాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు ఆమె పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి జగన్ లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న తరుణంలో, సీఎస్ మార్పుపై జగన్ సుముఖంగా లేరు.

మరోవైపు, కరోనా నేపథ్యంలో రిటైర్ కావాల్సిన అధికారుల పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు పొడిగించింది. ఇదే విధంగా నీలం సాహ్ని పదవీకాలాన్ని కూడా పొడిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో వైయస్ మరణించిన సమయంలో అప్పటి సీఎస్ రమాకాంత్ రెడ్డి పదవీకాలాన్ని కేంద్రం మూడు నెలలు పొడిగించింది. ఏపీ విభజన సందర్భంగా పీకే మహంతి పదవీకాలాన్ని నాలుగు నెలలు పొడిగించింది.

More Telugu News