Narendra Modi: మోదీ ప్యాకేజీకి 'ఆత్మ నిర్భర్ భారత్' అనే పేరు ఎందుకు పెట్టారంటే.. : నిర్మలా సీతారామన్

Focus on Indias alround development says Nimala Seetharaman
  • దేశం ముందు ఒక సమగ్రమైన దార్శనికతను మోదీ ఉంచారు
  • స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడమే ప్యాకేజీ లక్ష్యం
  • ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారతం అని అర్థం
కరోనా నేపథ్యంలో బలహీన పడిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిదే. ఈ ప్యాకేజీకి సంబంధించి వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ, దేశం ముందు ఒక సమగ్రమైన దార్శనికతను ప్రధాని మోదీ ఉంచారని అన్నారు. వివిధ స్థాయుల్లో సంప్రదింపులను జరిపిన తర్వాత ప్యాకేజీని ప్రకటించారని... దేశ ఆర్థికి వృద్ధిని పెంచడమే ప్యాకేజీ లక్ష్యమని చెప్పారు.  

ఐదు మూల సూత్రాల ఆధారంగా 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్రకటనను మోదీ చేశారని తెలిపారు. ఆ ఐదు సూత్రాలు... ఆర్థికం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ప్రజలు, గిరాకీ అని చెప్పారు. స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడమే ఈ ప్యాకేజీ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే... స్వయం ఆధారిత భారతం అని అర్థమని తెలిపారు.

ఆత్మ నిర్భర్ భారత్ కు సంబంధించిన వివరాలను రోజుకొకటి వెల్లడిస్తామని చెప్పారు. ఈ ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు ఉంటాయని చెప్పారు. ఈరోజు ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) లకు సంబంధించి ప్రకటిస్తున్నామని తెలిపారు.
Narendra Modi
Nirmala Sitharaman
BJP
Package

More Telugu News