Sekhar Kammula: దీన్ని అతి పెద్ద అవార్డుగా భావిస్తున్నా: శేఖర్ కమ్ముల

  • పారిశుద్ధ్య కార్మికులకు బాదంపాలు, మజ్జిగ పంచే ఏర్పాటు చేసిన శేఖర్ కమ్ముల
  • ప్లకార్డులు పట్టుకుని ధన్యవాదాలు తెలిపిన సిబ్బంది
  • చాలా ఆనందంగా ఉందన్న శేఖర్
Sanitation workers thanks Sekhar Kammula

సినీ దర్శకుడు శేఖర్ కమ్ములకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పారిశుద్ధ్య సిబ్బంది మర్చిపోలేని విధంగా ధన్యవాదాలు తెలిపారు. దీనిపై శేఖర్ కమ్ముల స్పందిస్తూ, గాంధీ ఆసుపత్రి వద్ద పని చేస్తున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల స్పందన వెలకట్టలేనిదని చెప్పారు.

'మీకు నేను చేసింది చాలా తక్కువ. ప్రతిరోజు మా కోసం మీరు చేస్తున్న దానిని దేనితోనూ పోల్చలేం. చాలా ఆనందంగా ఉంది. దీన్ని చాలా పెద్ద అవార్డుగా భావిస్తున్నా' అంటూ శేఖర్ కమ్ముల ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కరోనా సంక్షోభ సమయంలో పారిశుద్ధ్య కార్మికులు ఎంతో సేవ చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి తన వంతుగా బాదంపాలు, మజ్జిగను అందించే ఏర్పాటును శేఖర్ కమ్ముల చేశారు. ఈ నేపథ్యంలో, గాంధీ ఆసుపత్రి వద్ద పని చేసే పారిశుద్ధ్య కార్మికులు శేఖర్ కమ్ములకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ థ్యాంక్స్ చెప్పారు.

More Telugu News