Vijayashanti: హైదరాబాదులో కరోనా కేసులు ఎక్కువగా నమోదవడంపై విజయశాంతి కొత్త అనుమానాలు!

  • ప్రజలు లాక్‌డౌన్ ను నిజాయతీగా పాటించారు
  • కేసులు పెరగడానికి వైన్ షాపులు కారణమైతే.. వాటిని మూసేయండి
  • జనాలపై తప్పును నెట్టేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నట్టుంది
Vijayashanti expresses doubts on rising corona cases

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 50 రోజుల పాటు ప్రజలంతా చాలా నిబద్ధతతో లాక్‌డౌన్ ను పాటించారని... ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతున్నాయని, దీనికి వైన్ షాపులను తెరవడమే కారణమని చెప్పారు. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ ద్వారా ప్రభుత్వంపై మండిపడ్డారు.

'జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడానికి కారణం ఏమిటి? సుమారు 50 రోజులుగా ప్రజలు నిజాయితీగా లాక్‌డౌన్ పాటించారు కదా? పాజిటివ్‌ల పెరుగుదలకు కేవలం వైన్ షాపులే కారణమైతే వాటిని మళ్ళీ మూసివేయండి. సరైన సంఖ్యలో పరీక్షలను ఇప్పటి వరకూ చేయకుంటే ఆ నిజాన్ని ఒప్పుకోండి. అన్ని త్యాగాలు చేసిన ప్రజలు అసలు సమస్య అర్థం కాక సతమతమవుతున్నారు. వైన్ షాపులు తెరవడమే ఈ పరిస్థితికి కారణమైతే, అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే స్థాయిలో పెరుగుదల నమోదై ఉండాలి కదా? ముఖ్యమంత్రి దొరగారు తమ తప్పిదాలను ప్రజల అలవాటు మీదకు నెట్టే ప్రయత్నమేదో చేస్తున్నట్టు కనిపిస్తోంది' అని విజయశాంతి అన్నారు.

More Telugu News