bandla ganesh: నెక్ట్స్ ఏ పార్టీలో చేరతారు?: అన్న ప్రశ్నకు బండ్ల గణేశ్ సమాధానం

bandla ganesh about politics
  • నెక్ట్స్ ఏ పార్టీ టీఆర్‌ఎస్? టీడీపీ? జనసేన? అంటూ ఓ నెటిజన్ ప్రశ్న
  • 'నో పాటిలిక్స్ అన్నా.. ఓన్లీ సినిమా' అని గణేశ్ క్లారిటీ
  • గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన బండ్ల గణేశ్
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని నెలలకే ఆయన రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. ఆయన మరో పార్టీలో చేరతారన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఆయన మరోసారి స్పష్టతనిచ్చారు.

'నెక్ట్స్ ఏ పార్టీ టీఆర్‌ఎస్? టీడీపీ? జనసేన?' అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బండ్ల గణేశ్ ట్విట్టర్‌లో సమాధానం చెప్పారు. 'నో పాటిలిక్స్ అన్నా.. ఓన్లీ సినిమా' అని గణేశ్ పేర్కొన్నారు. కాగా, వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్‌కి కృతజ్ఞతలని అప్పట్లో బండ్ల గణేశ్ ప్రకటించారు. రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానన్న అభిప్రాయాలను కూడా గతంలో చెప్పారు.
bandla ganesh
Tollywood
Congress

More Telugu News