రానా, మిహీకాల పెళ్లిపై పూర్తి క్లారిటీ ఇచ్చిన సురేశ్ బాబు

13-05-2020 Wed 13:41
  • డిసెంబర్ లో పెళ్లి జరగొచ్చు
  • అంతకు ముందు కూడా పెళ్లి జరిగే అవకాశం ఉంది
  • పెళ్లి ప్లానింగ్ లో బిజీగా ఉన్నాం
Daggubati Suresh Babu gives clarity on Rana marriage
తన ప్రేయసి మిహీకా బాజాజ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు సినీ నటుడు రానా ప్రకటించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై రానా తండ్రి, సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. 'బాంబే టైమ్స్' తో మాట్లాడుతూ తన కుమారుడి పెళ్లి గురించి సురేశ్ బాబు మాట్లాడారు.

రానా, మిహీకా ఒకరికొకరు చాలా కాలంగా తెలుసని సురేశ్ బాబు తెలిపారు. వారిద్దరూ జీవితంలో ఒకటి కావాలనుకోవడం సంతోషకరమని చెప్పారు. వివాహానికి సంబంధించిన అన్ని విషయాలను సరైన సమయంలో వెల్లడిస్తామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసే అవకాశం ఉందని... అంతకు ముందే కూడా జరగవచ్చని చెప్పారు. అన్ని విషయాలు ఖరారైన తర్వాత పూర్తి విషయాలను వెల్లడిస్తామని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో తాము బిజీగా ఉండేలా పిల్లలిద్దరూ పని కల్పించారని చెప్పారు. పెళ్లి ప్లానింగ్ లో ప్రస్తుతం తామంతా బిజీగా ఉన్నామని తెలిపారు.

మరోవైపు... రానా, మిహీకా ఇద్దరూ గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నట్టు బాంబే టైమ్స్ తెలిపింది. అయితే, తమ బంధాన్ని వారు నిన్ననే వెల్లడించారు.