‘ఎల్జీ పాలిమర్స్’ నుంచి ‘స్టిరీన్’ తరలింపు ప్రక్రియ ప్రారంభం
- నిన్న రాత్రి నుంచి ట్యాంకర్ల ద్వారా తరలింపు
- పోర్టు ప్రాంతంలోని టీ2, టీ3 ట్యాంకులలో స్టిరీన్
- ఈ నెల 17 లోపు ద.కొరియా తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి
విశాఖ పోర్టు ప్రాంతంలోని టీ2, టీ3 ట్యాంకులలో ఉన్న 9,869 టన్నుల స్టిరీన్ ని వెనక్కి పంపేందుకు పోర్టు అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడారు. ఆయా ట్యాంకుల నుంచి 7,919 టన్నుల స్టిరీన్ ని వెజల్ అర్హన్ లోకి లోడింగ్ చేశారు. మిగిలిన స్టిరీన్ ను వెజల్ నార్డ్ మేజిక్ ద్వారా ఈ నెల 17 లోపు దక్షిణ కొరియా తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, విశాఖలో మొత్తం 13,048 టన్నుల స్టిరీన్ ను జిల్లా యంత్రాంగం గుర్తించింది.