Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ దంపతుల ఫొటో పోస్ట్ చేస్తూ, బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

bandla ganesh about jr ntr
  • సీనియర్ ఎన్టీఆర్ దంపతుల ఫొటోనూ పోస్ట్ చేసిన బండ్ల గణేశ్
  • అప్పుడు పెద్ద రామయ్య పుణ్య దంపతులు
  • ఇప్పుడు చిన్న రామయ్య దంపతులు అంటూ వ్యాఖ్య
  • ఎన్టీఆర్ తమ బ్యానర్ కు అవకాశం ఇవ్వడం అదృష్టమన్న గణేశ్
రాజకీయాలకు గుడ్‌ బై చెప్పి మళ్లీ సినిమాలపై దృష్టి పెడుతున్న నిర్మాత బండ్ల గణేశ్.. ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ గురించి చేసిన ట్వీట్లు ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన విషయం తెలిసిందే. ఆయన తాజగా జూనియర్‌ ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'అప్పుడు పెద్ద రామయ్య పుణ్య దంపతులు.. ఇప్పుడు చిన్న రామయ్య దంపతులు' అంటూ ఆ ఇద్దరు దంపతుల ఫొటోలను ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌తో మళ్లీ ఓ సినిమా తీయాలని ఆయనను అభిమానులు కోరుతున్నారు.  

'బండ్ల గణేశ్ అన్న మాకు 2 బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చావ్...జై ఎన్టీఆర్' అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన బండ్ల గణేశ్.. 'యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు మా బ్యానర్ కు అవకాశం ఇచ్చారు అది నా అదృష్టం' అని పేర్కొన్నారు. కాగా, జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి జరిగి ఇటీవలే తొమ్మిదేళ్లు నిండిన విషయం తెలిసిందే. 2011, మే 5న ఎన్టీఆర్-ప్రణతి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు అభయ్ రామ్, భార్గవ్ రామ్.
Junior NTR
bandla ganesh
Tollywood

More Telugu News