Venkaiah Naidu: ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజ్ ను స్వాగతించిన ఉపరాష్ట్రపతి

  • ‘కరోనా’ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ ప్యాకేజ్ దోహదపడుతుంది
  •  దేశ ఆర్థికస్వావలంబనకు ఈ ప్యాకేజ్ ఊతమిస్తుంది
  •  స్థానిక పరిశ్రమలకు చేయూత నివ్వాలన్న ఉప రాష్ట్రపతి 
Vice president Venkaiah Naidu welcomes package

‘కరోనా’, లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలను ఆదుకోవాలన్న తలంపుతో రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజ్ ను ప్రధాని నరేంద్రమోదీ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వాగతించారు. ‘కరోనా’ సవాళ్లను ఎదుర్కొనేందుకు, దేశ ఆర్థిక స్వావలంబనకు ఈ ప్యాకేజ్ ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, వివిధ వర్గాలకు ఈ ప్యాకేజ్ ద్వారా మేలు జరుగుతుందని భావించారు. ఆత్మనిర్భర భారత్ స్వప్న సాధనకు సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం ఇదేననని అన్నారు. స్థానిక పరిశ్రమలకు చేయూత నివ్వాలని, తద్వారా భారత్ అంతర్జాతీయంగా పోటీ పడేలా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.

More Telugu News