అసలు జగన్ ఏపీకి చెందిన వ్యక్తో, కాదో నువ్వే తేల్చాలి సాయి రెడ్డి గారు: అయ్యన్నపాత్రుడు
- మొన్నటి వరకు కేసీఆర్-జగన్ ది తండ్రి, కొడుకుల అనుబంధం అన్నారు
- ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తొలగిపోయాయన్నారు
- ఇరు రాష్ట్రాలు కలిసి ఉమ్మడి ప్రాజెక్టులు చేపడుతున్నాయన్నారు
- జగన్ గారు రాయలసీమ బిడ్డో, కాదో
'విజయసాయిరెడ్డి గారు మొన్నటివరకూ కేసీఆర్-జగన్ ది తండ్రి, కొడుకుల అనుబంధం అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తొలగిపోయాయి అన్నారు. ఇరు రాష్ట్రాలు కలిసి ఉమ్మడి ప్రాజెక్టులు చేపడుతున్నాయంటూ కేసీఆర్ గారి చేతిని నాకిన జగన్ గారు రాయలసీమ బిడ్డో, కాదో, అసలు జగన్ ఏపీకి చెందిన వ్యక్తో, కాదో నువ్వే తేల్చాలి సాయి రెడ్డి గారు. నాన్న కి కోపం వచ్చింది అని మెత్తబడతారా? మెడలు వంచి నీళ్లు సాధిస్తారా?' అని నిలదీశారు.