మలయాళ హిట్ మూవీ రీమేక్ లో పవన్?

13-05-2020 Wed 10:38
  • మలయాళంలో హిట్ కొట్టిన 'డ్రైవింగ్ లైసెన్స్'
  • రీమేక్ చేసే ఆలోచనలో బడా నిర్మాత
  • ఆ సినిమా చూడనున్న పవన్
Driving Licence Movie

కథాకథనాల్లో ఆసక్తి .. పాత్రలను తీర్చిదిద్దడంలో వైవిధ్యం నచ్చితే రీమేక్ లు చేయడానికి పవన్ ఉత్సాహాన్ని చూపుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఓ మలయాళ మూవీ రీమేక్ లో చేయమంటూ ఒక స్టార్ ప్రొడ్యూసర్ పవన్ కల్యాణ్ ను సంప్రదించినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.

మలయాళంలో క్రితం ఏడాది వచ్చిన 'డ్రైవింగ్ లైసెన్స్' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. లాల్ జూనియర్ తెరకెక్కించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ .. సూరజ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఓ సూపర్ స్టార్ కి .. ఆయన అభిమాని అయిన ఆర్టీవో ఆఫీసర్ కి మధ్య ఈ కథ నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని భావించిన ఓ బడా నిర్మాత, పవన్ ను కలిసినట్టుగా చెప్పుకుంటున్నారు. 'డ్రైవింగ్ లైసెన్స్' సినిమాను చూడమనీ, కథ నచ్చితే తన బ్యానర్లో చేద్దామని ఆయన పవన్ కి చెప్పాడట. మరి పవన్  కల్యాణ్ ఈ సినిమాను ఎప్పుడు చూస్తాడో .. చూసిన తరువాత ఏం చెప్తాడో చూడాలి.