Chiranjeevi: అన్నీ కుదిరితేనే 'ఆచార్య'లో చరణ్: కొరటాల

Acharya Movie
  • షూటింగు దశలో 'ఆచార్య'
  • చరణ్ పాత్రపై అభిమానుల్లో అయోమయం
  •  డౌట్ గా చెప్పిన కొరటాల శివ  
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'  సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. లాక్ డౌన్ కారణంగా షూటింగు వాయిదా పడింది. ఈ సినిమాలో చరణ్ ఒక కీలకమైన పాత్రను పోషించనున్నట్టు వార్తలు వచ్చాయి. చరణ్ డేట్స్ 'ఆర్ ఆర్ ఆర్'  సినిమాకిగాను రాజమౌళి దగ్గర వున్నాయి. అందువలన కొరటాల శివ సినిమా చేయడానికి రాజమౌళి అనుమతిని చరణ్ తీసుకున్నాడు.

తన సినిమా షూటింగు .. విడుదల సమయాలు చూసుకుని రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఊహించని విధంగా కరోనా దెబ్బకి  అన్ని సినిమాల షెడ్యూల్స్ .. నటీనటుల డేట్లు తారుమారై పోయాయి. దాంతో తన సినిమా ప్లానింగ్ లో తేడా వస్తుండటంతో, రాజమౌళి మనసు మార్చుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి చరణ్ తప్పుకున్నాడనే టాక్  తాజాగా వినిపిస్తోంది.

ఓ ఇంటర్వ్యూలో కొరటాల దీనిపై మాట్లాడుతూ .. "కొన్ని ఇబ్బందులైతే వున్నాయి .. అన్నీ కుదిరితేనే చరణ్ ఈ సినిమాలో నటిస్తాడు' అని చెప్పారు. చరణ్ ఈ సినిమాలో లేకపోతే మెగా అభిమానులు ఒకింత నిరాశకి లోనవుతారనే చెప్పాలి.
Chiranjeevi
Charan
Koratala Siva
Acharya

More Telugu News