Corona Virus: కరోనాతో పోరాడి విజయం సాధించిన 113 ఏళ్ల బామ్మ.. రికార్డు

113 year old woman won the battle against coronavirus
  • కరోనాను జయించిన అత్యంత పెద్ద వయస్కురాలిగా గుర్తింపు
  • స్పెయిన్‌కే చెందిన 106 ఏళ్ల బామ్మ రికార్డు బద్దలు
  • స్పానిష్ ఫ్లూనూ జయించిన బామ్మ
113 ఏళ్ల వయసులో కరోనాతో పోరులో విజయం సాధించిందో బామ్మ. ఫలితంగా కరోనా నుంచి కోలుకున్న అతి పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. ఆమె పేరు మరియా. స్పెయిన్‌కు చెందిన ఆమె ఏప్రిల్‌లో కరోనా బారినపడింది. ఓల్డేజ్ కేర్ హోంలో ఉంటున్న ఆమెను అధికారులు అక్కడే ఐసోలేషన్‌లో ఉంచారు. అప్పటి నుంచి మహమ్మారి వైరస్‌తో పోరాడుతున్న మరియా ప్రస్తుతం కోలుకుంది. చిన్నపాటి ఒళ్లు నొప్పులు తప్ప మరేమీ లేవని ఆమె సంతోషంగా చెప్పుకొచ్చింది.

స్పెయిన్‌లోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందిన మరియా.. 1918-19 మధ్య చెలరేగిన స్పానిష్ ఫ్లూను కూడా జయించడం విశేషం. మరియా కంటే ముందు స్పెయిన్‌కే చెందిన 106 ఏళ్ల బామ్మ కరోనా నుంచి బయటపడి రికార్డు సృష్టించగా, ఇప్పుడా రికార్డును మరియా తుడిచిపెట్టేసింది.
Corona Virus
Spain
113 year old woman

More Telugu News