Bengaluru: లాక్‌డౌన్ తర్వాత తొలిసారి.. మరికాసేపట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు తొలి రైలు

  • నిన్న రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరిన రైలు
  • రైలులో 200 మంది తెలంగాణ వాసులు
  • సికింద్రాబాద్‌లో ఎక్కనున్న 300 మంది
First train coming to Secunderabad railway station after lockdown

లాక్‌డౌన్ తర్వాత నేడు తొలిసారి ఓ ప్రయాణికుల రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రానుంది. నిన్న రాత్రి 8:30 గంటలకు కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్‌లో బయలుదేరిన బెంగళూరు-ఢిల్లీ (రాజధాని) ఏసీ సూపర్ ఫాస్ట్ రైలు మరికాసేపట్లో సికింద్రాబాద్ చేరుకోనుంది. అనంతరం బయలుదేరి రేపు తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంటుంది.

కాగా, లాక్‌డౌన్ కారణంగా బెంగళూరులో చిక్కుకుపోయిన దాదాపు 200 మంది తెలంగాణవాసులు ఈ రైలులో సికింద్రాబాద్ చేరుకోనున్నారు. అలాగే, తెలంగాణలో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది ప్రయాణికులు ఢిల్లీ వైపుగా ప్రయాణించనున్నారు. మరోపక్క, ఢిల్లీలో నిన్న రాత్రి 9:15 గంటలకు బయలుదేరిన మరో రైలు నేటి సాయంత్రం సికింద్రాబాద్ చేరుకోనున్నట్టు అధికారులు తెలిపారు.

More Telugu News