Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

Nayanatara getting ready for wedding
  • పెళ్లికి రెడీ అవుతున్న నయనతార
  • మరో రికార్డు కొట్టిన బన్నీ పాట
  • వాయిదా పడిన సూపర్ స్టార్ సినిమా
  *  దక్షిణాది బిజీ కథానాయిక నయనతార తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ ని త్వరలోనే పెళ్లి చేసుకోనుందని వార్తలొస్తున్నాయి. ఇటీవల నయనతారను ఉద్దేశించి 'తన కాబోయే పిల్లలకి తల్లి' అంటూ విఘ్నేశ్ సోషల్ మీడియాలో కామెంట్ చేసిన దగ్గర నుంచీ కోలీవుడ్ లో వీరి వివాహంపై చర్చ జరుగుతోంది. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని, అందుకే ఇప్పుడు విఘ్నేశ్ తమ బంధాన్ని బయటపెట్టాడని అంటున్నారు.
*  అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం మ్యూజికల్ గా ఎంతటి విజయాన్ని సాధించిందో మనకు తెలుసు. ఇందులోని ప్రతి పాటా సూపర్ హిట్టయింది. ఈ క్రమంలో ఇందులోని 'రాములో రాములా' పాట యూ ట్యూబ్ లో 100 మిలియన్ (10 కోట్లు) వ్యూస్ ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డును కొట్టింది.
*  లాక్ డౌన్ కారణంగా సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం విడుదల వాయిదా పడింది. శివ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రస్తుతం 'అన్నాత్తే' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దసరాకు విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని ఇక సంక్రాంతికి వాయిదా వేసుకున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
Nayanatara
Allu Arjun
Rajanikanth
Keerthi Suresh

More Telugu News