ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. ప్రసూతి ఆసుపత్రిలో విచక్షణ రహితంగా కాల్పులు.. పసికందులనూ వదలని ముష్కరులు!
- మొత్తం 14 మంది మృతి.. మృతుల్లో అప్పుడే కళ్లు తెరిచిన ఇద్దరు పసికందులు
- నేలకొరిగిన బాలింతలు, నర్సులు
- మరో ఘటనలో 21 మంది దుర్మరణం
ఈ ఘటనలో మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో ఇద్దరు అప్పుడే పుట్టిన చిన్నారులు ఉండడం గమనార్హం. చనిపోయిన మిగతా 12 మందిలో బాలింతలు, నర్సులు ఉన్నారు. ఈ ఘటనకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.
మరో ఘటనలో 21 మంది మృతి చెందారు. ఓ మిలీషియా కమాండర్ అంత్యక్రియల కార్యక్రమంపై ఆత్మాహుతి సభ్యుడు బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 21 మంది దుర్మరణం పాలయ్యారు.