Miheeka Bajaj: రానా పెళ్లాడబోతున్న మిహీక బజాజ్ వివరాలు ఇవిగో!

All about for Miheeka Bajaj who said yes to Rana Daggubato
  • మిహీక బజాజ్ ను తన కాబోయే భార్యగా పరిచయం చేసిన రానా
  • మిహీక స్వస్థలం హైదరాబాద్
  • తల్లిదండ్రులకు హైదరాబాద్ లోనే జ్యుయెలరీ వ్యాపారం
తన ప్రపోజల్ కు మిహీక బజాజ్ యస్ అని చెప్పిందంటూ అగ్రనటుడు రానా దగ్గుబాటి రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. గతంలో రానా గురించి అనేక కథనాలు వచ్చినా, రానా దేనిపైనా స్పందించకపోవడంతో అవన్నీ వచ్చినంత త్వరగా అంతర్థానమయ్యాయి. అయితే ఈసారి రానానే స్వయంగా తన ప్రేయసిని పరిచయం చేయడంతో అటు టాలీవుడ్, ఇటు అభిమానులు ఆశ్చర్యపోయారు. రానా మనసు దోచిన ఆ అందాలభామ ఎవరంటూ విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు.

మిహీక స్వస్థలం హైదరాబాదే! అయితే ముంబయిలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తోంది. అంతేకాదు, డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరిట ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్, డెకరేషన్ సంస్థ నడుపుతోంది. ఈ సంస్థ ప్రధానంగా సెలబ్రిటీ వివాహాల నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. ఇండియన్ ఆర్కిటెక్చర్ అంటే అమితమైన మక్కువ చూపే మిహీక ముంబయిలోని రచన సంసద్ విద్యాలయం నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ లో డిప్లొమా అందుకుంది. లండన్ లోని చెల్సియా యూనివర్సిటీలో ఆర్ట్ అండ్ డిజైనింగ్ లో ఎంఏ చేసింది.

ఇక మిహీక తల్లిదండ్రుల విషయానికొస్తే వారు హైదరాబాద్ లోనే క్రస్లా బ్రాండ్ పేరిట జ్యుయెలరీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. తండ్రి పేరు సురేశ్ బజాజ్, తల్లిపేరు బంటీ బజాజ్. మిహీక తల్లి బంటీ జ్యుయెలరీ డిజైనర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె హైదరాబాద్ జేఎన్ టీయూలో విద్యాభ్యాసం చేశారు. మొదట్లో తల్లితో కలిసి వెడ్డింగ్ ప్లానర్ గా పనిచేసిన మిహీక ఆపై సొంతంగా ఈవెంట్లు చేపడుతూ జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

మిహీకకు సమర్థ్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. క్రస్లా బ్రాండ్ కార్యకలాపాలన్నీ అతడే చూసుకుంటున్నాడు. సమర్థ్ వివాహం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కునాల్ రావల్ సోదరి సాషాతో జరిగింది.
Miheeka Bajaj
Rana
Hyderabad
Mumbai

More Telugu News