Nani: కామెడీ థ్రిల్లర్ జోనర్లో నాని

  • నాని తాజా చిత్రంగా రానున్న 'వి'
  • తదుపరి చిత్రంగా 'టక్ జగదీశ్'
  • వివేక్ ఆత్రేయకి ఛాన్స్ ఇచ్చిన నాని  
Vivek Atreya Movie

టాలీవుడ్లో కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే యువ కథానాయకులలో ఒకరుగా నాని కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'వి' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత నాని 'టక్ జగదీశ్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగు కొంతవరకూ జరిగింది. లాక్ డౌన్ తీసేయగానే మళ్లీ మొదలుకానుంది.

ఆ తరువాత దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి నాని సెట్స్ పైకి వెళ్లనున్నాడు. కామెడీ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. 'బ్రోచేవారెవరురా' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ, అదే తరహాలో నాని సినిమాను రూపొందించనున్నట్టు చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.  లాక్ డౌన్ పూర్తికాగానే అందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయనున్నట్టు తెలుస్తోంది.  వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా నాని నుంచి పూర్తి భిన్నమైన కథలు రానుండటం విశేషం.

More Telugu News