KTR: పూర్తి ఆరోగ్యంగా ఉన్నా.. ఆందోళన వద్దు: కేటీఆర్

Iam full healthy says KTR
  • నిన్న సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన కేటీఆర్
  • జలుబుతో బాధపడిన వైనం
  • ఆందోళన వ్యక్తం చేసిన అభిమాని
తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల పర్యటన సందర్భంగా కొంచెం అలర్జీ, జలుబుతో ఇబ్బంది పడ్డానని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఈ అలర్జీతో తాను ఇబ్బంది పడుతున్నానని తెలిపారు. తన పర్యటనను సడన్ గా క్యాన్సిల్ చేసుకుంటే ప్రజలు ఇబ్బంది పడతారని... అందుకే ఎవరూ ఇబ్బంది పడకూడదని పర్యటనకు వెళ్లానని చెప్పారు. ఎవరికైనా అసౌకర్యాన్ని కలిగించినట్టైతే క్షమించాలని కోరారు. తన ఆరోగ్యం పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.  

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి టెక్స్ టైల్ పార్క్ లో రూ. 14.50 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులను నిన్న కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా జలుబు కారణంగా ఆయన కొంత ఇబ్బందిగా కనిపించారు. దీంతో, ట్విట్టర్ వేదికగా ఒక అభిమాని ఆందోళన వ్యక్తం చేశారు.
KTR
TRS
Allergy
Flu

More Telugu News