East Godavari District: ‘కరోనా’ కట్టడికి వినూత్న ప్రచారం.. పెళ్లిలో మాస్కుల పంపిణీ!

  • తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో పెళ్లి
  • పెళ్లికి వచ్చిన వారికి మాస్కుల పంపిణీ
  • బయటకు వెళ్లేప్పుడు మాస్కులు ధరించాలని వినతి
Maskhs gifts in wedding function

లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే వివిధ శుభకార్యాలు వాయిదాపడ్డ విషయం తెలిసిందే. అయితే, అధికారుల అనుమతితో అతికొద్ది మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుంటున్న జంటలు లేకపోలేదు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కొవ్వూరి సత్తిరెడ్డి కూడా తన కుమారుడు కిరణ్ వివాహాన్ని నిరాడంబరంగా నిన్న జరిపించారు.

కొమరిపాలెం గ్రామానికి చెందిన లక్ష్మితో కిరణ్ వివాహం జరిగింది. తన కుమారుడి పెళ్లికి బంధువులు, గ్రామస్థులు రాకపోయినా ఇంట్లో ఉండి వారి దీవెనలు అందించాలని కోరారు. అయితే, పెళ్లికి హాజరైన వారికి మాత్రం మాస్కులు అందజేశారు. ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వినూత్న రీతిలో తెలియజేశారు. బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించాలని సత్తిరెడ్డి కోరారు.

More Telugu News