ఒక్క సీన్ షూట్ చేస్తే 'క్రాక్' పూర్తయినట్టే

12-05-2020 Tue 14:46
  • రవితేజ నుంచి రానున్న 'క్రాక్'
  • మరోసారి జోడీ కడుతున్న శ్రుతి హాసన్
  • ఈ ఏడాది చివర్లో విడుదల  
Krack Movie

రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్'  సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఒక సీన్ మాత్రమే పెండింగ్ వుంది. ఆంధ్రలోని ఒక సరుగుడు తోటలో ఈ సీన్ ను చిత్రీకరించడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ లోగా లాక్ డౌన్ ను ప్రకటించడంతో షూటింగు ఆగిపోయింది.  లాక్ డౌన్ ఎత్తేయగానే  ఈ ఒక్క సీన్ ను చిత్రీకరించుకుని వస్తారట.

శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో విడుదల చేయాలని భావిస్తున్నారట. గతంలో రవితేజ - శ్రుతిహాసన్ జంటగా నటించిన 'బలుపు' విజయాన్ని సాధించింది. అందువలన ఈ కాంబినేషన్ పై అందరిలో ఆసక్తి తలెత్తుతోంది. ఇక చాలా గ్యాప్ తరువాత శ్రుతి హాసన్ తెలుగులో చేస్తున్న సినిమా ఇది. అందువలన ఆమె అభిమానులంతా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు రవితేజ .. గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కూడా విజయాలను అందుకోవడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది.