Revanth Reddy: 45 రోజుల వ్రతం.. కేసీఆర్ వల్ల భంగమైంది: రేవంత్ రెడ్డి

  • లిక్కర్ షాపులు తెరవడంతో మొత్తం ఆగమైంది
  • జనాల్లో కరోనా భయం పోయింది
  • కరోనా కేసులు పెరగడానికి వైన్ షాపులు తెరవడమే కారణం
Revanth Reddy fires on KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనాను కట్టడి చేసేందుకు 45 రోజుల పాటు కొనసాగిన లాక్ డౌన్ వ్రతం... కేసీఆర్ వల్ల భంగమైందని చెప్పారు. లిక్కర్ షాపులు తెరవడంతో మొత్తం ఆగమైందని అన్నారు. మద్యం షాపులు తెరవడంతో ప్రజల్లో కరోనా భయం పోయిందని... విచ్చలవిడిగా ఇళ్ల నుంచి బయటకు  వచ్చేస్తున్నారని  చెప్పారు. కరోనా కేసులు పెరగడానికి వైన్ షాపులు తెరవడమే కారణమని అన్నారు.

పెద్ద సంఖ్యలో జనాలు పోగయ్యే వైన్ షాపులకు అనుమతించారని... ఒకరో, ఇద్దరో పని చేసుకునే మెకానిక్ షాపులకు అనుమతి ఇవ్వలేదని రేవంత్ విమర్శించారు. లిక్కర్ పై వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ప్రధానమైనప్పుడు... చిరు వ్యాపారాలు చేసుకునే వారికి వారి వ్యాపారాలే ముఖ్యమని చెప్పారు. మరోవైపు సీఎల్పీ కార్యాలయంలో మల్లు భట్టి విక్రమార్కతో రేవంత్ భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడిని మారుస్తారనే వార్తల నేపథ్యంలో వీరి భేటి ఆసక్తిని రేపుతోంది.

More Telugu News