Narendra Modi: లాక్‌డౌన్‌పై ఈ రోజు కీలక నిర్ణయం ప్రకటించనున్న ప్రధాని మోదీ

  • ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగం
  • లాక్‌డౌన్‌ సడలింపులు, కరోనా కట్టడి చర్యలపై మాట్లాడనున్న మోదీ
  • మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు
PM Narendra Modi to address nation at 8 pm day after meeting chief ministers over lockdown strategy

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 17తో ముగుస్తున్న నేపథ్యంలో నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సమావేశంలో పాల్గొని చర్చించిన విషయం తెలిసిందే. ఈ నెల 17 అనంతరం లాక్‌డౌన్‌ను పొడిగించాలా? లేక నిబంధనలు సడలించాలా? అన్న అంశాలపై ఆయన ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు.

దాదాపు ఆరు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో మోదీకి సీఎంలు కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో తమ నిర్ణయాన్ని ప్రకటించేందుకు  మోదీ సిద్ధమయ్యారు. ఆయన ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. లాక్‌డౌన్‌ సడలింపులు, కరోనా కట్టడి చర్యలపై ఆయన ప్రసంగించనున్నారు.

కాగా, తొలి దశ లాక్‌డౌన్‌లో తీసుకున్న పలు చర్యలు రెండో దశలో తీసుకునే అవసరం లేదని, అలాగే, రెండో దశలో తీసుకున్న పలు చర్యలను మూడో దశలో తీసుకోలేదని మోదీ నిన్న సీఎంలతో అన్నారు. ఇప్పుడు మూడో దశలో తీసుకున్న చర్యలు నాలుగో దశలో తీసుకునే అవసరం లేదని మోదీ స్పష్టం చేశారు. దీంతో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News