Pullela Gopichand: బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు హోం క్వారంటైన్ ముద్ర

Badminton coach pullela Gopi chand Home Quarantine
  • విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న గోపీచంద్
  • కోదాడలోని రామాపురం చెక్ పోస్ట్ వద్ద వైద్య పరీక్షలు
  • హోం క్వారంటైన్ స్టాంప్ వేసిన తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బంది
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు హోం క్వారంటైన్ ముద్ర పడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న గోపీచంద్ కు తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం చెక్ పోస్ట్ వద్ద ఆయనకు ఈ పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్ ముద్ర వేసింది.

అత్యవసరంగా హైదరాబాద్ వస్తుండగా తనకు వైద్యపరీక్షలు నిర్వహించారని చెప్పారు. దీనిపై తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బంది స్పందిస్తూ  ఆంధ్రా నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతి ప్రయాణికుడికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నట్టు చెప్పారు.
Pullela Gopichand
Badminton coach
Home quaratine

More Telugu News