KIA Motors: లాక్ డౌన్ సడలింపులు.. అనంతపురం ‘కియా’లో కార్ల ఉత్పత్తి ప్రారంభం

Ananthapuram KIA production Begins
  • పెనుకొండలో ఉన్న కియా మోటార్స్ కార్ల పరిశ్రమ
  • ఏడు వందల మంది కార్మికులతో ఉత్పత్తి ప్రారంభించాం
  • ఈ మేరకు కంపెనీ వర్గాల ప్రకటన
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా వెసులుబాటు లభించడంతో అనంతపురం కియా పరిశ్రమలో కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. పెనుకొండ మండలంలో ఉన్న కియా మోటార్స్ కార్ల పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 7 నుంచి, ఏడు వందల మందితో ఉత్పత్తి ప్రారంభించామని తెలిపింది.

కాగా, లాక్ డౌన్ అనంతరం మార్చి 25వ తేదీన ఈ సంస్థ మూతపడింది. దాదాపు 42 రోజుల పాటు కంపెనీలో ఉత్పత్తి ఆగిపోయింది. లాక్ డౌన్ నేపథ్యంలో తమ ఉద్యోగాలు పోతాయని కార్మికులు భావించారు. కానీ, తిరిగి ఉత్పత్తి ప్రారంభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
KIA Motors
Anantapur District
Penukonda

More Telugu News