Junior NTR: ఎన్టీఆర్ బర్త్ డేకి నారా రోహిత్ స్పెషల్ గిఫ్ట్

Nara Rohith
  • ముగింపు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • త్రివిక్రమ్ తో తదుపరి సినిమా  
  • లైన్లో దర్శకుడు ప్రశాంత్ నీల్
ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు నాటికి ఆయన అత్యంత భారీ బడ్జెట్ చిత్రమైన 'ఆర్ ఆర్ ఆర్' చేస్తున్నాడు. అలాగే హిట్ చిత్రాల దర్శకుడిగా పేరున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇక సంచలన దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోను ఒక సినిమా చేయనున్నాడు.

ఈ పుట్టిన రోజు సందర్భంగా 'ఆర్ ఆర్ ఆర్' నుంచి స్పెషల్ వీడియో .. త్రివిక్రమ్ మూవీ నుంచి టైటిల్ పోస్టర్ .. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు గురించిన ప్రకటన వెలువడనున్నాయి. అందువలన ఎన్టీఆర్ కి ఇది మరింత ప్రత్యేకమైన పుట్టినరోజు అని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ పుట్టినరోజున తాను ఒక స్పెషల్ గిఫ్ట్ ను సిద్ధం చేసినట్టుగా నారా రోహిత్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఆ స్పెషల్ గిఫ్ట్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ నెల 20వ తేదీ వరకూ వేచి వుండవలసిందేనని అన్నాడు. ఎన్టీఆర్ - నారా రోహిత్ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి నారా రోహిత్ ఇవ్వనున్న స్పెషల్ గిఫ్ట్ ఏమై ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Junior NTR
Nara Rohith
Tollywood

More Telugu News