18 నుంచి ఎగరనున్న దేశీయ విమానాలు!
- 17తో ముగియనున్న లాక్‌డౌన్ గడువు
- హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి దేశీయ సర్వీసులు
- ఢిల్లీ విమానాశ్రయంలో నిన్న తనిఖీలు
విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలపై డీజీసీఏ, సీఐఎస్ఎఫ్, విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారులు, డీఐఏఎల్ అధికారులతో కూడిన కమిటీ ఢిల్లీ విమానాశ్రయంలో నిన్న తనిఖీలు నిర్వహించింది. సర్వీసులు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి దేశీయ సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికార వర్గాలు తెలిపాయి.