China: జరిగింది ఇదీ అని చెబుతున్నా, అమెరికా అబద్ధాలు ఆపడంలేదు: చైనా

  • అమెరికా, చైనా మధ్య కరోనా వార్
  • కరోనా వైరస్ వ్యాప్తికి చైనాయే కారణమంటున్న అమెరికా
  • ఇదేమీ చిన్నపిల్లల ఆట కాదన్న చైనా
China condemns US comments on corona spreading

కరోనా వైరస్ వ్యాప్తికి కారణం చైనాయేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా మంత్రులు కూడా ఆరోపిస్తుండడం తెలిసిందే. దీనిపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అమెరికా చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునియింగ్ స్పష్టం చేశారు.

మొదట్నించి జరిగింది ఇదీ అని తాము చెబుతూనే ఉన్నామని, అయితే అమెరికా అబద్ధాలు చెబుతూనే ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ సూక్తిని సదరు చైనా ప్రతినిధి ప్రస్తావించారు. కొందరిని ఎప్పుడూ ఫూల్ చేయొచ్చని, కొన్నిసార్లు అందరినీ ఫూల్ చేయొచ్చని, కానీ అన్నిసార్లు అందరినీ ఫూల్ చేయడం మాత్రం కుదరదని పేర్కొన్నారు.

తాము సమాచారం ఇవ్వడంలేదని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, కానీ ప్రతి విషయం ఓ క్రమపద్ధతిలో వెల్లడించామని స్పష్టం చేశారు. తాము చెప్పిన కరోనా గణాంకాలపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఇదేమీ చిన్నపిల్లల ఆట కాదని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, దీనికి సంబంధించి  '24 అసంబద్ధ ఆరోపణలు' అటూ 30 పేజీల సుదీర్ఘ వివరణను చైనా విదేశాంగ శాఖ తన వెబ్ సైట్ లో ఉంచింది.

More Telugu News