Andhra Pradesh: రాజధాని తరలింపు అంశంపై న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

  • రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్
  • ఏప్రిల్ 24న విచారించిన న్యాయస్థానం
  • అఫిడవిట్ సమర్పించేందుకు రాష్ట్రానికి వ్యవధి
  • న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాకే నిర్ణయం తీసుకుంటామన్న ఏపీ సర్కారు
AP Government files counter in High Court

ఏపీ రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా అమరావతి జేఏసీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏప్రిల్ 24న విచారణ జరిపిన న్యాయస్థానం అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు తాజాగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. చట్టసభల్లో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, న్యాయపరమైన చిక్కులు పూర్తయ్యాకే నిర్ణయం తీసుకుంటామంటూ అఫిడవిట్ సమర్పించింది. సచివాలయ ఉద్యోగుల సమావేశంతో ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొంది.

More Telugu News