Visakha LG Polymers: ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద ఆందోళన చేసిన వారిపై పోలీసు కేసుల నమోదు!

  • ఎల్జీ కంపెనీ వద్ద స్థానికులు, బాధిత కుటుంబీకులు ఆందోళన
  • గ్రామస్తులతో పాటు, ఏడుగురు కమ్యూనిస్ట్ నేతలపై కేసులు
  • స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలని ఆదేశించిన కోర్టు
Police case against LG Polymers protesters

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజ్ ప్రమాదం మిగిల్చిన విషాదం అంతాఇంతా కాదు. ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. పలువురు బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ఎల్జీ కంపెనీ వద్ద స్థానికులు, మృతులు, బాధితుల కుటుంబీకులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. మృతదేహాలను పక్కన పెట్టుకుని వారు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఆందోళకు దిగిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఐదు గ్రామాలకు చెందిన వారితో పాటు, ఏడుగురు కమ్యూనిస్ట్ నేతలపై ఐపీసీ సెక్షన్లు 147, 447, 353, 188, 271, 51(ఏ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో పలువురు పరారీలో ఉన్నారని, వీరికి రిమాండ్ విధించాలని పోలీసులు కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి... నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలని పోలీసులను ఆదేశించారు.

More Telugu News