Jagatgirigutta: హైదరాబాద్ శివారులో పట్టపగలే ఓ యువకుడి దారుణ హత్య!

  • స్థానిక జగద్గిరిగుట్టలో  ఘటన
  • పాతకక్షల నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తుల దాడి
  • యువకుడిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు
A Rowdy sheeter murdered in Hyderabad

హైదరాబాదు శివారు, మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో పట్టపగలే ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక జగద్గిరిగుట్టలో ఆ యువకుడిపై సుమారు పది మంది గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు.

ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ పీ కాలనీలో నివసిస్తున్న ఫయాజ్(25) ఆటోడ్రైవర్ గా పని చేస్తున్నాడు. బంజారా హిల్స్ ప్రాంతానికి చెందిన ఫయాజ్ కొంత కాలం నుంచి ఇక్కడ నివసిస్తున్నాడు. ఈ కాలనీలోని కొందరితో ఫయాజ్ కు విభేదాలు తలెత్తిన కారణంగా చాలాసార్లు వారి మధ్య గొడవలు జరిగాయి. ఈ హత్య జరగడానికి మూడు రోజుల క్రితం కూడా వారితో గొడవపడ్డాడు.

ఇవాళ మధ్యాహ్నం ఫయాజ్ ను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించారు. కత్తులతో దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో పరుగులు తీసిన ఫయాజ్ చివరకు ఓ ఇంటి ముందు కిందపడిపోయాడు. అప్పటికే గాయపడి ఉన్న ఫయాజ్ ను గుర్తుతెలియని వ్యక్తులు మరోమారు పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News