Pawan Kalyan: గ్యాస్ లీక్ ప్రమాదంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి: పవన్‌

There are many doubts on gas leakage incident says Pawan Kalyan
  • లాక్ డౌన్ సమయంలో ట్యాంకర్ల ఉష్ణోగ్రతలను ఎందుకు పర్యవేక్షించలేదు?
  • బ్రీథర్ వాల్వ్ తెరిచింది నిజమేనా?
  • ప్రమాదం జరిగినప్పుడు సైరన్ ఎందుకు మోగలేదు?
విశాఖ ఎల్జీ పాలిమర్స్ లీకేజ్ ఘటనపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పలు అంశాలను రసాయన శాస్త్ర నిపుణులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ట్యాంకర్ల ఉష్ణోగ్రతలను ఎందుకు పర్యవేక్షించలేదని ప్రశ్నించారు. ట్యాంక్ పేలకుండా బ్రీథర్ వాల్వ్ ను తెరిచింది నిజమేనా? అని నిలదీశారు. ప్రమాదం జరిగినప్పుడు సైరన్ ఎందుకు మోగలేదని... ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేదని అడిగారు. మొత్తం 24 అంశాలపై లోతుగా దర్యాప్తు జరపాలని... ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
Pawan Kalyan
Janasena
Vizag Gas Leak
Visakha LG Polymers

More Telugu News