Liquor Sales: ఆన్ లైన్ లో మద్యం అమ్మకాల అంశాన్ని పరిశీలించాలని భావిస్తున్న తెలంగాణ

  • తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • ఇప్పటివరకు 1196 పాజిటివ్ కేసులు
  • కేసులు పెరిగితే మద్యం విక్రయాలపై చర్యలుంటాయన్న మంత్రి
Telangana government mulls on online liquor sales as an alternative

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1196 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 30 మంది మరణించారు. గత కొన్నిరోజులుగా కొత్త కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. ఇటీవలే మద్యం అమ్మకాలు కూడా ప్రారంభించిన నేపథ్యంలో, పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగితే ఏం చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

దీనిపై ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి, ఆన్ లైన్ మద్యం అమ్మకాలపై చర్చిస్తామని తెలిపారు. కరోనా వ్యాప్తి కట్టడి చేసే క్రమంలో మద్యం డోర్ డెలివరీ అంశాన్ని కూడా పరిశీలిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నట్టయితే మద్యం విక్రయాలపైనా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. భౌతికదూరం అమలు చేయని దుకాణాలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

More Telugu News