Telugu News Channel: టీవీ 5 న్యూస్ ఛానల్ ఆఫీసుపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్!

Man who attacked Telugu news channel arrested
  • హైదరాబాదులోని ఛానల్ కార్యాలయంపై 8వ తేదీన దాడి
  • తాగిన మైకంలో కిటికీ అద్దాలు పగలగొట్టిన వైనం
  • శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిరంజీవిగా గుర్తింపు
ఇటీవల ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ 5 కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న ఛానల్ కార్యాలయంపై ఈ నెల 8న దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిరంజీవి (33)గా గుర్తించారు.

చిరంజీవి హైదరాబాదులో ఉంటూ వెల్డింగ్ వృత్తి చేసుకుంటున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో పని లేక... జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద ఫుట్ పాత్ పై ఉంటున్నాడు. తాగిన మైకంలో ఛానల్ కార్యాలయం కిటికీ అద్దాన్ని పగలగొట్టాడు. ఈ నేపథ్యంలో చిరంజీవిపై ఐపీసీ సెక్షన్లు 447, 421 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. చిరంజీవి ఏ పార్టీకి చెందిన వాడు కాదని పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Telugu News Channel
Attack
Arrest

More Telugu News