Keerthi Suresh: కీర్తి సురేశ్ కొత్త చిత్రం టైటిల్ ఇదే!

Keerthi Suresh new movie Good Luck Sakhi
  • కీర్తి సురేశ్ తాజా చిత్రంగా 'మిస్ ఇండియా'
  • ముగింపు దశలో తదుపరి సినిమా
  • ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు
తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ వుంది. 'మహానటి' సక్సెస్ నుంచి కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను కూడా ఆమె వరుసగా ఒప్పేసుకుంటోంది. అలా నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఆమె 'మిస్ ఇండియా' చేసింది. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇక నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మాతగా కీర్తి సురేశ్ మరో సినిమా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇటీవలే ఈ సినిమాకి ఒక టైటిల్ అనుకున్నారట. అయితే ఆ టైటిల్ 'దిల్' రాజుకి నచ్చకపోవడంతో, ఆ విషయంపై గట్టిగానే కసరత్తు చేశారట. చివరికి 'గుడ్ లక్ సఖీ' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఈ టైటిల్ ఉందనే అభిప్రాయాన్ని టీమ్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారట. ఇక ఈ కథలో కొత్తదనం .. తన పాత్రలోని ప్రత్యేకత కారణంగా, ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో కీర్తి సురేశ్ ఉందట. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Keerthi Suresh
Nagesh Kukunoor
Good Luck Sakhi

More Telugu News