Nirmal District: భైంసాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కర్ఫ్యూ విధింపు

Curfew imposed in Bhainsa
  • గత రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ
  • నివురు గప్పిన నిప్పులా పరిస్థితి
  • భైంసా చేరుకున్న కరీంనగర్ రేంజ్ ఐజీ
నిర్మల్ జిల్లా భైంసాలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు 24 గంటలపాటు కర్ఫ్యూను విధించారు. కర్ఫ్యూ కారణంగా పట్టణం బోసిపోయింది. బయట అడుగుపెట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు. పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉండడంతో భైంసా చేరుకున్న కరీంనగర్ రేంజ్ ఐజీ, ఇంచార్జ్ డీఐజీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Nirmal District
bhainsa
Telangana
Curfew

More Telugu News